తనకు తాను తెలుసుకోవడం కన్నా మించిన బాధ్యత యెవరికైనా మరేదీ లేదు, ఉండదు. ఇదే మానవుడిగా, మానవుడు సాధించాల్సిన ఒకే ఒక స్థితి, గమ్యం, ఉద్ధేశ్యం, అవసరము. మానవులు కోరుకునే, అనుకునే మిగిలినవన్నీ మిధ్య, భ్రమ, భ్రాంతి మాత్రమే. ఉన్నట్లు, నిజమైనట్లు సత్యంగా అంతా అన్నీ గోచరిస్తాయి, కానీ యేమీ, యేవీ లేనివే. ఇది సత్యం. జాగ్రత్ సుషుప్తి స్వప్న యే అవస్తల్లోనైనా యెవరైనా 'నేను ఉన్నాను' అంటారు గానీ 'నేను లేను' అనరు. అనలేరు యెప్పుడూ.
అణువులోనైనా, ఆకాశంలోనైనా 'నేను' ఉంది. చెప్పవలసి వస్తే 'నేను' అణువు, 'నేను' ఆకాశం, 'నేను' చెట్టు, 'నేను' పర్వతం, 'నేను' పులి......యిట్లానే చెప్పడం జరుగుతుంది. 'నేను' లేనిది యేమీ లేదు, ఉండదు. అదే సర్వాంతర్యామి, నీవు, అందరూ, ఆన్నీ.....నీ స్వరూపమే. ఇది గ్రహించితే పరిమితమైన ప్రేమ, పూర్ణ విశాలమైన విశ్వప్రేమ అవుతుంది.
ప్రపంచం ,దేశం, కాలం అహంకారమే, అహంకారానికే. ప్రపంచ విషయాలు వస్తువులు బంధాలు ఆన్నీ అహంకారానికే. ఇవన్నీ వస్తూ,పోతూ మారుతూ వుండేవే. శాశ్వతం కాదు, సత్యం కాదు. సదా అన్ని కాలాలలో(కాలరహితంగా), సర్వత్రా అన్ని దేశ ప్రదేశాలలో(దేశరహితంగా) మార్పు లేనిదిగా పరిపూర్ణంగా అనంత శక్తిగా, మౌనంగా, చైతన్యంగా, బ్రహ్మానందంగా, ఉండేదే 'నేను'
దానినే ఉన్నది, సత్, ఆత్మ, పరంబ్రహ్మం, పరమేశ్వరుడు, నారాయణుడు, శ్రీహరి.......యిలా యెన్నో, అన్ని పేర్లూ, యే పేరయినా దానికే, దానిదే. దానికంటే వేరుగా యేదీ లేదు, ఉండదు.
ప్రపంచం(ఆబ్జెక్ట్), అహంకారం(సబ్జెక్ట్), లేనివే. చూచే అహంకారం వలననే వున్నట్లు వున్న ప్రపంచం కనిపిస్తున్నది. ఈ అహంకారాం పైనే గురిపెట్టి 'నేనెవరు? విచారణలో ' సత్ అయిన 'నేను' ను కనుక్కోగలము. భగవాన్ శ్రీ రమణ మహర్షి అనంతమైన ఓర్పుతో అనుగ్రహంతో బోధించిన యీ మార్గం యెవరికైనా అనుకూలమే, సాధన చేయగలిగేదే, సులభమైనదే, ఫలితాన్ని అతిమ విజయాన్ని తప్పక యిచ్చేదే.
జై శ్రీ రమణాయ నమః
మూలం : నీవేవరివో నువ్వు కనుక్కో
రచయత : ఏ. ఆర్. నటరాజన్
తెలుగు అనువాదం :శ్రీ రమణానుగ్రహి
3 comments:
Read below books
1. STOPPED IN OUR TRACKS: STORIES OF U.G. IN INDIA
2. U.G. Krishnamurti: A Life: by Mahesh Bhatt
3. Sage and the Housewife
4.The Mystique of Enlightenment
5.Mind is a Myth
6. Thought is your enemy
7.Science and U.G.
http://www.well.com/~jct/
http://divinityinnature.com/
SRIRAM
చాలా బాగుందండి వ్యాసం. గతంలో, నీవు ఎవరు అన్న ప్రశ్నకు ప్రకృతి ఇచ్చిన సమాధానంగా వ్రాసిన నా కవిత గుర్తుకొచ్చింది.
ధరణీమణి దాహార్తికి
చిరుజల్లులు కురిపించగ
సుమశరములు సంధించిన
జలధరముల హరిధనువును నేనే
హిమపాతపు స్వరఝరిలో
శివరాతిరి రసధునిలో
నిటలాక్షుడు నర్తించగ
విడివడిన సిరిమువ్వల ఘనజ్వాలను నేనే
నగముల చిరునగవుకు
మురిసిల్లి స్పృశియించిన
సురభామల దరహాసపు
శ్వసనంలో చలనంలా నేనే
ప్రత్యూషపు కాంతుల్లో
కుసుమించిన కెందమ్ముల
అందాలను అలరించే
మిహిరారుణ చరణంలో కిరణంలో నేనే
వడగాలుల వింజామరలో
బీటలువారిన ఎండునేలలో
సంవేశించిన చిరుమొలకల
అలకల పెనుకదలికలో నేనే
భువనయాత్రలో సంగ్రామిస్తూ
అభవఘోషలో సంగమించిన
శుష్కకాష్ఠములు ప్రస్తానించే
ప్రేతభూమిలో చితులు కాలిన తరివినీడలో నేనే
శిశిరంలో తిమిరంలో
గగనంలో గర్జనలో
జడివానల, పెనుగాలుల
పరాక్రమంలో, ప్రకంపనల్లో నేనే
అణువుఅణువులా నిక్వాణంలో
క్షణపుక్షణపు నిశ్వాసంలో
అనంతకాలపు ఆరోహణల
గమనంలో నేనే
గమ్యంలో నేనే
అక్క,
రమణ మహర్షి గురించి ఒక సారి నా బ్లాగులో కామెంటుగా చదివాను .. ఇప్పుడు వివరంగా చూస్తున్నాను. నేను ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నాను కదా, నీ వద్ద ఈ పుస్తకం ఉన్నట్లైతే నాకు పోస్టు చెయ్యగలవు, తిరిగి యధా తధంగా నీకు చేర్చే భాద్యత నాది.
Post a Comment